close

తాజా వార్తలు

ఆ గాయకుడిపై బహిష్కరణ

దిల్లీ: ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌(ఏఐసీడబ్ల్యూఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ గాయకుడు మీకాసింగ్ పాకిస్థాన్లోని కరాచీ నగరంలో ప్రదర్శన నిర్వహించినందుకుగానూ ఆయనపై నిషేధం విధించింది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ సమీప బంధువు వివాహ వేడుకలో మీకాసింగ్‌ ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ‘‘ప్రొడక్షన్‌ హౌజ్‌లు, మ్యూజిక్‌ కంపెనీలు, ఆన్‌లైన్ మ్యూజిక్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు మికాసింగ్‌తో కలిసి పనిచేయడాన్ని ఏఐసీడబ్ల్యూఏ నిషేధించింది. ఎవరైనా ఈ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఆందోళనక పరిస్థితులు నెలకొన్న వేళ మికా సింగ్‌ చేసిన పని దేశ ఔన్నత్యాన్ని తగ్గించేలా ఉంది’’ అని ఏఐసీడబ్ల్యూ అధ్యక్షుడు సురేశ్‌ శ్యామ్‌లాల్‌ గుప్తా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.   

జమ్ముకశ్మీర్‌లో 370వ అధికరణని రద్దు చేసిన తరువాత భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన దాయాది దేశం వాణిజ్య బంధాన్ని రద్దు చేసుకోవడమేగాక బాలీవుడ్‌ సినిమాలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు చెందిన సమీప బంధువు ఇంట్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో మికాసింగ్‌ సంగీత ప్రదర్శన నిర్వహించారు. దీంతో అటు పాకిస్థాన్‌తో ఇటు భారత్‌లోని నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వేడుక ఆగస్టు 8న జరిగినట్లు సమాచారం. దీనిపై స్పందించిన ఏఐసీడబ్ల్యూఏ తాజాగా ఆయనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు