close

తాజా వార్తలు

మాలిక్‌జీ.. ఎప్పుడు రమ్మంటారు: రాహుల్‌

దిల్లీ: కశ్మీర్‌లో పర్యటించేందుకు తాను సిద్ధమని.. ఎప్పుడు రమ్మంటారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నించారు. గవర్నర్‌ కోరినట్లుగా ఎలాంటి షరతులు లేకుండా అక్కడి ప్రజల్ని, నాయకుల్ని కలిసేందుకు తనకు సమ్మతమేనన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని.. అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు వివరించాలని రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సత్యపాల్‌ మాలిక్‌ కావాలంటే తానే విమానం ఏర్పాటు చేస్తానని.. వచ్చి కశ్మీర్లో పర్యటించాలని రాహుల్‌కు సవాల్‌ విసిరారు.
 
ఈ నేపథ్యంలో వీరివురి మధ్య రెండు రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. గవర్నర్‌ ఆహ్వానాన్ని రాహుల్‌ మంగళవారం స్వాగతించారు. అయితే తనకు విమానం అక్కర్లేదనీ... తనతోపాటు ప్రతిపక్ష నేతల బృందం జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లలో పర్యటిస్తుందన్నారు. ఆ సందర్భంగా సామాన్య ప్రజలు, నాయకులు, సైనికులను కలిసేందుకు స్వేచ్ఛ ఇస్తే చాలన్నారు. దీనిపై స్పందించిన సత్యాపాల్‌ మాలిక్‌ విపక్ష నేతలను కూడగట్టి కశ్మీర్‌ లోయలో అశాంతిని సృష్టించాలని రాహుల్‌ యోచిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే ఆయన పర్యటనకు అనేక షరతులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా షరతులు లేకుండానే కశ్మీర్‌లో పర్యటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్‌ అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు