close

తెలంగాణ

ముగిసిన భాషా పండితుల పాదయాత్ర

కవాడిగూడ, న్యూస్‌టుడే: భాషా పండితులకు పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ..యాదగిరిగుట్ట నుంచి చేపట్టిన పాదయాత్ర మంగళవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో ముగిసింది. తెలంగాణ రాష్ట్రయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ సంయుక్త ఆధ్వర్వంలో ఈ ఆందోళన నిర్వహించారు.నినాదాలు చేస్తూ సచివాలయానికి వెళ్లి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ జిల్లాపరిషత్‌ పాఠశాలల్లోని గ్రేడ్‌-2 భాషా పండితులు, అర్హులైన వ్యాయామ ఉపాధ్యాయులందరికీ పదోన్నతి కల్పించాలన్న ప్రభుత్వ ఉత్తర్వు తప్పక అమలు కావాలని పరిషత్‌ అధ్యక్షుడు సి.జగదీశ్‌ కోరారు. మునుపటి జీవోలలోని లోపాలను ప్రభుత్వం సరిదిద్దాలని భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర నాయకుడు శ్రీనివాసాచార్య అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు