close

జాతీయ- అంతర్జాతీయ

దేశభక్తిని రగిల్చే వీడియో సంగీతం 

విడుదల చేసిన జావడేకర్‌

దిల్లీ: పంద్రాగస్టు వేడుకల నిమిత్తం ‘వతన్‌’ పేరుతో రూపొందించిన వీడియో సంగీతాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మంగళవారమిక్కడ విడుదల చేశారు. దూరదర్శన్‌, ప్రసార భారతి సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. కేరళ అందాలు, రాజస్థాన్‌ ఎడారులు, ఈశాన్య రాష్ట్రాల గిరులు, సైనికుల విన్యాసాలు, గగన తలాన యుద్ధ విమానాలు, చంద్రయాన్‌-2, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌, యోగా దినోత్సవాన్ని ప్రధాని ప్రారంభిస్తున్న ఘట్టాలకు అద్దంపట్టే దృశ్య సమాహారంగా దీన్ని తయారుచేశారు. ఈ వీడియో దేశభక్తిని రగిలిస్తుందని, స్వాతంత్య్ర దినోత్సవానికి మరింత వన్నె తెస్తుందని జావడేకర్‌ పేర్కొన్నారు. సాయుధ దళాల గౌరవార్థం, అమరవీరులకు నివాళిగా వతన్‌ను రూపొందించినట్టు అధికారులు పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు