close

ఆంధ్రప్రదేశ్

పవిత్రోత్సవం.. ఘనంగా పరిసమాప్తం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూర్ణాహుతితో మంగళవారం పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. స్వామి సన్నిధి నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి కల్యాణోత్సవ మండపానికి వేంచేసిన అనంతరం రుత్విక్కులు యాగశాలలో హోమాలు నిర్వహించారు. స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని పూర్తి చేశాక.. మధ్యాహ్నం ఒంటి గంటకు విశేష సమర్పణ చేశారు. సాయంత్రం 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపులో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు