close

ఆంధ్రప్రదేశ్

అడుగులు తడబడితే ‘భోజనం’ బురదపాలే..!

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా మంత్రాలయంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణమంతా ఇలా బురదమయమైంది. ప్రస్తుతమిక్కడ 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నిత్యం మధ్యాహ్న భోజనం సమయంలో స్థానిక వంటశాల నుంచి విద్యార్థులు కంచాలు పట్టుకొని వచ్చి తరగతి గదుల ఎదుట ఉన్న వరండాలో కూర్చుని తింటారు. గురువారం కొందరు విద్యార్థులు భోజనం కంచాలతో బురదలో ఇలా ఆచితూచి అడుగులు వేస్తూ కనిపించారు. ఈ క్రమంలో ఏ మాత్రం అడుగులు తడబడినా భోజనం బురదపాలు కావాల్సిందే. వర్షం కురిసిన ప్రతిసారీ పాఠశాల ఆవరణ చిత్తడిగా మారుతుండటంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని చిన్నారులు చెబుతున్నారు.

- న్యూస్‌టుడే, మంత్రాలయం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు