close

క్రైమ్

కాబూల్‌లో ఉగ్ర ఘాతుకం

గురుద్వారాపై ముష్కరుల దాడి

25 మంది సిక్కుల మృతి

ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్‌

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి రక్తసిక్తమైంది. సిక్కుల ప్రార్థనా మందిరమైన గురుద్వారాలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 25 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో షోర్‌ బజార్‌లోని గురుద్వారాలో 150 మంది ప్రార్థన చేస్తున్నారు. తుపాకులు పేల్చుతూ, బాంబులు విసురుతూ ముష్కరులు ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. దాడి అనంతరం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య పరస్పర కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు ముష్కరులు మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రకటించుకున్నట్లు స్థానిక ప్రతిక పేర్కొంది. కాబూల్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత్‌ ఖండించింది. అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కుల రక్షణకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందంటూ విదేశీవ్యవహారాల శాఖ పేర్కొంది.
విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
అఫ్గానిస్థాన్‌లోని సిక్కుల ప్రార్థనా మందిరంపై ఉగ్రవాదుల దాడి ఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు