close

జాతీయ- అంతర్జాతీయ

వదంతుల సృష్టికర్తలపై కఠిన చర్యలు

రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ లేఖ

ఈనాడు, దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులకు కొరత ఉన్నట్లు కొందరు వదంతులు సృష్టించే ప్రమాదం ఉందని, అలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. నిత్యావసరాలకు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది. వీటి లభ్యతపై ఎప్పటికప్పుడు ప్రచారం చేయాలని సూచించింది. వస్తువుల సరఫరా, సేవల పరంగా సమస్యల పరిష్కారానికి నోడల్‌ అధికారులను నియమించాలని తెలిపింది. అపోహలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, శాంతి-సామరస్యతలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలంది.నిత్యావసరాల సరఫరాపై 24×7 ప్రాతిపదికన పనిచేసేలా కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయాలని కేంద్రం తెలిపింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు