close

క్రైమ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంటి నుంచి వెళ్లి.. నిర్జన ప్రాంతంలో శవమై..

అనుమానాస్పద స్థితిలో రైతు మృతి


మృతి చెందిన శివరాజ్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ రైతు మృతి చెందారు. ఈ సంఘటన శంషాబాద్‌ మండల పరిధి పెద్దతూప్రలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లికి చెందిన శివరాజ్‌(60) చాలాకాలం క్రితం బతుకుదెరువు కోసం పెద్దషాపూర్‌కు వచ్చారు. ఇక్కడే స్థిరపడి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వగ్రామంలో ఇంటి స్థలం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొనసాగుతుంది. స్థల వివాదంపై పంచాయతీ ఉందని జూలై 30న మధ్యాహ్నం బయలుదేరి వెళ్లి కనిపించకుండా పోయాడు. పెద్దతూప్ర సమీపంలో నిర్జన ప్రదేశంలో మృత్యువాత పడ్డాడు. అటుగా వెళ్లిన కొంతమంది స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో మద్యం సీసాలు లభించాయి. మృతదేహాన్ని ఉస్మానియా శవాగారానికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు (వివాహితులు) ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వై.ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు