close

తాజా వార్తలు

మిడిల్‌ఆర్డర్‌కు ఇద్దరిని ఎంపిక చేసిన మంజ్రేకర్‌

దిల్లీ: ప్రపంచకప్‌లో నాలుగు, ఐదో స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియని సందిగ్ధంలో ఉంది టీమిండియా. ఈ సందర్భంగా మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ ఇద్దరి పేర్లను సూచించారు. భారత మిడిల్‌ ఆర్డర్‌లో విజయ్‌శంకర్‌, కేదార్‌ జాదవ్‌ ఇద్దరూ నాలుగు, ఐదో స్థానంలో సరిపోతారని చెప్పాడు. విరాట్‌కోహ్లీ మినహా జట్టులో ఏ ఒక్కరూ పరిస్థితులకు తగినట్లు ఆడటం లేదని మంజ్రేకర్‌ ఓ క్రికెట్‌ ఛానల్‌కి చెందిన బ్లాగులో రాసుకొచ్చాడు. ‘రోహిత్‌ ఆడటానికి ప్రయత్నిస్తాడు కాని విఫలమౌతాడు. శిఖర్‌ధావన్‌ వికెట్‌ కాపాడుకోడానికే ప్రాధాన్యం ఇస్తాడు తప్ప జట్టుని ముందుండి నడిపించలేడు’ అని మంజ్రేకర్‌ చెప్పాడు.

అలాగే ధోనీ తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠకు తీసుకెళతాడని వివరించాడు. కోహ్లీ, రవిశాస్త్రి మద్దతుతో అంబటిరాయుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో రాణించాడనీ.. అయితే స్వదేశంలో లభించిన మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడని మంజ్రేకర్‌ రాసుకొచ్చాడు. కుదురుగా ఆడే రాయుడు.. అప్పటివరకూ మంచిగా ఆడి చెత్త బంతులకు ఔటతాడని వివరించాడు. అలాగే జాదవ్‌.. గత ఇంగ్లాండ్‌ పర్యటనలో బ్యాటింగ్‌ గొప్పగా లేకపోయినా మధ్య ఓవర్లలో వికెట్‌ కాపాడుకొని వీలైనప్పుడు సింగిల్స్‌ తీయడం మంచిదన్నాడు. ఆఖరి ఓవర్లలో భారీ షాట్లకు వెళ్లడం ద్వారా మంచి స్కోరు సాధించే అవకాశముందని మంజ్రేకర్‌ తెలిపాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు