close

తాజా వార్తలు

అలా మాట్లాడింది నా కుమారుడు కాదు

చెన్నై: తమిళ ప్రజల కోసం కథానాయకుడు అజిత్‌ రాజకీయాల్లోకి రావాలని దర్శకుడు సుశీంద్రన్‌ కోరిన సంగతి తెలిసిందే. ద్రవిడ రాజకీయాల్లో మార్పు రావాలంటే అజిత్‌ రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.ఈ వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు సానుకూలంగా స్పందిస్తే.. మరి కొందరు సుశీంద్రన్‌ అభిప్రాయాన్ని తప్పుపట్టారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత టి. రాజేందర్‌ కుమారుడు కురలరసన్‌ పేరుతో ఉన్న సోషల్‌మీడియా ఖాతాలో చేసిన పోస్ట్‌ వివాదాస్పదంగా మారింది. ‘టి. రాజేందర్‌ తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి’ అని రాశారు. దీంతో ఈ విషయం వివాదానికి దారి తీసింది. స్వయంగా రాజేందర్‌ కుమారుడు ఇలా మాట్లాడారు అనుకుని అజిత్‌ ఫ్యాన్స్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం గురించి తాజాగా జరిగిన మీడియా సమావేశంలో రాజేందర్‌ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు తన కుమారుడు చేయలేదని, అది ఫేక్‌ ఖాతా అని స్పష్టం చేశారు. తన పేరుకు భంగం కల్గించేందుకే కురలరసన్‌ పేరుతో ఖాతా నడుపుతున్నారని చెప్పారు. అంతేకాదు ఆ ఖాతా ప్రారంభించిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు