close

ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుళ్లు, వార్డర్‌, ఫైర్‌మెన్‌ రాత పరీక్షకు 98.98% హాజరు

ఈనాడు, అమరావతి: కానిస్టేబుళ్లు, వార్డర్‌, ఫైర్‌మెన్‌ పోస్టులకు ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 98.98% మంది అభ్యర్థులు హాజరైనట్లు రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక బోర్డు ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ ప్రకటనలో తెలిపారు. మొత్తం 65,240మంది హాల్‌టికెట్లు జారీ చేయగా.. 64,574మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రాథమిక ‘కీ’ని slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో సోమవారం ఉదయం 11గంటల  నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రాథమిక ‘కీ’పై   అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20లోపు apslprb.obj@gmail.com మెయిల్‌కు బోర్డు  సూచించిన పట్టిక రూపంలో పంపించాలని సూచించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు