close

ఆంధ్రప్రదేశ్

వైకాపా డ్రామా కంపెనీ: లోకేష్‌

దుగ్గిరాల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా తెలుగుదేశం ప్రభుత్వ పాలన సాగుతోందని మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి, మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఆయన ఐదు గ్రామాల్లో ప్రచారం చేశారు. జలధార ప్రాజెక్టు ద్వారా 24 నెలల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ అందించనున్నామని వెల్లడించారు. వైకాపా ఒక డ్రామా కంపెనీలా ప్రవర్తిస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు నిర్వహించని విధంగా ఎంపీలతో రాజీనామాలు చేయించి తొలి డ్రామా ఆడారని, కోడికత్తి దాడి రెండో డ్రామా అయితే.. వివేకానందరెడ్డి హత్య జరిగితే తొలుత గుండెనొప్పితో చనిపోయారని, తర్వాత హత్య అని అది కూడా చంద్రబాబు చేయించారంటూ మూడో డ్రామా ఆడుతున్నారని పేర్కొన్నారు. తొలుత పెదకొండూరులోని పుట్టలమ్మ గుడిలో లోకేష్‌ పూజలు చేశాక దుగ్గిరాల మండలంలో ప్రచారం ప్రారంభించారు. పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం, పెదపాలెం, చినపాలెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు