close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమ్మాయిని వేధిస్తున్నాడు... ఏం చేయను?

నేనో ఉపాధ్యాయురాలిని. నా విద్యార్థుల్లో ఒకమ్మాయిని ఓ ఆటో డ్రైవర్‌ పాఠశాలకు, బయటకు వెళ్లే సమయంలో ఫాలో అవుతున్నాడట. అప్పుడప్పుడు ఆమె పేరు, ఇతర వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. వాళ్ల అమ్మానాన్నతో చెప్పమన్నా. కానీ ఆమె వారు ఏమంటారోననే భయంతో విషయం చెప్పడం లేదు. ఏం చేయాలి?

- ఓ సోదరి

 

టువంటి విషయాన్ని చూసి వదిలేయకుండా పరిష్కారం దిశగా ఆలోచించినందుకు మీకు అభినందనలు. అలాంటి ఆకతాయిల నుంచి మీ విద్యార్థినిని రక్షించుకోవాలంటే మీరు షీ బృందాలు, భరోసా లేదా స్థానికంగా ఉండే పోలీసుల సహాయం తీసుకోవచ్చు. వారికి నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తారు. బాధితులకు నష్టపరిహారం కూడా అందజేస్తారు. పోలీసుల వరకు ఈ విషయాలు వెళ్లకూడదని మీరు భావిస్తే మీ విద్యార్థినిని, ఆమె తల్లిదండ్రుల్ని ఒక కౌన్సెలర్‌ దగ్గరకు తీసుకెళ్లండి. కూతురి పరిస్థితి వాళ్లకు అర్థమవుతుంది. అవసరమైన చర్యలు తీసుకుంటారు. అమ్మనాన్నలకు ఈ విషయాలు చెబితే తిడతారనే భయంతో పిల్లలు రహస్యంగా ఉంచుతారు. కానీ దానివల్ల సమస్యలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. ఇదే విషయాన్ని మీ విద్యార్థినికి అర్థమయ్యేలా చెప్పండి. అలాగే అవసరం అనుకుంటే... మీరే చొరవ తీసుకుని ఓసారి ఆమె పెద్దవాళ్ల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడమే మంచిది. ఒకవేళ వాళ్లకు సరైన అవగాహన లేనప్పుడు షీ బృందాలు లేదా పోలీసులను సంప్రదించాలి.

మీ ప్రశ్నలు ఇకపై vasupsych@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని