close

ఆంధ్రప్రదేశ్

10% ఈవీఎంలు పనిచేయలేదు

పవన్‌ కల్యాణ్‌ ఆందోళన

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 శాతం ఈవీఎంలు సక్రమంగా పని చేయలేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని పిన్నమనేని పాలిక్లినిక్‌ రహదారిలోని శ్రీచైతన్య ఒలింపియాడ్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏ బటన్‌ ప్రెస్‌ చేసినా ఒకే పార్టీ గుర్తుకు ఓట్లు పోల్‌ అవుతున్నట్లుగా సమాచారం అందిందని తెలిపారు. గాజువాక సహా పలు నియోజకవర్గాల్లో ఓటు యంత్రాలు సరిగా పనిచేయలేదని.. ఓటర్లు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధికి, సమతుల్యతకు బాటలు వేస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు