close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సైకిల్‌తో వ్యాయామం... చలాకీగా

టీనేజీ దాటాక సైకిల్‌ తొక్కాలంటే సిగ్గు పడతారు చాలామంది. కానీ దీన్ని వ్యాయామ సాధనంగా ఎంచుకుని చూడండి. వారంలో కనీసం రెండు రోజులపాటు అరగంటైనా తొక్కితే చాలు... ఎన్ని ప్రయోజనాలో!

* సైకిలు తొక్కినప్పుడు మెదడు నుంచి న్యూరోట్రాన్స్‌మీటర్లు విడుదల అవుతాయి. ఇవి జీవక్రియల పనితీరును మెరుగు పరుస్తాయి. ఏకాగ్రత, చురుకుదనం కూడా పెరుగుతుంది.
* నడిచినప్పుడు, పరుగెత్తినప్పుడు మోకాళ్లు, వెన్నుపై కొంత ఒత్తిడి పడే ఆస్కారం ఉంటుంది. కానీ సైకిలు తొక్కడం వల్ల కీళ్లపై పడే ఒత్తిడి తక్కువ. ప్రయోజనాలు ఎక్కువ. తొడలు, పిరుదుల భాగాల్లో పేరుకున్న కొవ్వు చాలా సులువుగా కరుగుతుంది.
* వారంలో మూడుసార్లు సైకిల్‌ తొక్కితే రక్తపోటు సమస్య తగ్గుతుంది. కొన్నిరకాల వ్యాయామాలతో పోలిస్తే.. గంట సైకిలు తొక్కితే గనుక 300 కెలొరీల వరకు ఖర్చవుతాయి.


మరిన్ని