4 కీలక సాంప్ర‌దాయ‌క‌ పన్ను ఆదా ప‌థ‌కాలు - Tax-saving-investments-for-conservative-investors
close

Published : 01/04/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4 కీలక సాంప్ర‌దాయ‌క‌ పన్ను ఆదా ప‌థ‌కాలు

నేడు కొత్త  ఆర్థిక సంవత్సరం 2021-22 లో అడుగుపెట్టాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయడంలో మీకు సహాయపడే పన్ను పొదుపు మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి.
ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే సాంప్ర‌దాయ‌క‌ పెట్టుబ‌డి ప‌థ‌కాలు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్):
పీపీఎఫ్, ఇది 15 సంవత్సరాల దీర్ఘకాలిక స్థిర ఆదాయ భద్రతా ప్రణాళిక,   ఈ త్రైమాసికానికి 7.1 వడ్డీ రేటును అందిస్తుంది. స్థిర-ఆదాయ పెట్టుబడులలో ఇదే అత్యధికం. ఇది మూడుద‌శ‌ల్లో ప‌న్ను మినహాయింపులను పొందుతుంది. అంటే మీరు పెట్టుబడి సమయంలో పన్ను మినహాయింపు పొందుతారు. అంతేకాక, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ త‌ర్వాత‌  ఉపసంహరించిన‌ మొత్తం పన్ను రహితంగా ఉంటాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ):
ఎన్‌ఎస్‌సీ ఒక చిన్న పొదుపు పథకం. పీపీఎఫ్ మాదిరిగా, సాంప్రదాయ‌క పెట్టుబడిదారులు ఇష్టపడే పన్ను ఆదా సాధనాల్లో ఎన్‌ఎస్‌సీ కూడా ఒకటి. ప్రస్తుతం  6.8 శాతం వడ్డీని అందిస్తుంది. వ‌డ్డీని ఏడాదికి ఒక‌సారి లెక్కించి మెచ్యూరిటీ స‌మ‌యంలో చెల్లిస్తారు.

 ఎన్‌ఎస్‌సీ సురక్షితమైన పెట్టుబడి, ఇది సంప్రదాయవాద పెట్టుబడిదారులకు బ్యాంక్ ఎఫ్‌డిల కంటే ఎక్కువ రాబడిని సంపాదించడానికి సహాయపడుతుంది. సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులు సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. అంతేకాకుండా, మీరు సంపాదించిన వడ్డీని తిరిగి పెట్టుబడిగా పరిగణిస్తారు, సెక్షన్ 80 సి కింద తాజా తగ్గింపుకు అర్హత పొందుతార‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అయితే మెచ్యూరిటీ పూర్త‌యిన ఏడాదిలో చివ‌రి సంవ‌త్స‌రం వ‌డ్డీ తిరిగి పెట్టుబడి పెట్టేందుకు వీలుండ‌దు, అది పన్ను పరిధిలోకి వస్తుంది. 

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ):
ఐదేళ్ల పదవీకాలం ఉన్న బ్యాంక్ ఎఫ్‌డీలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాలకు అర్హత ఉంటుంది. సాంప్రదాయిక పెట్టుబడిదారులకు మార్కెట్లో హెచ్చుతగ్గుల వల్ల మూలధన నష్టం జరిగే ప్రమాదం లేదు.  ఎఫ్‌డీ ప్రారంభించే సమయంలో వడ్డీ రేటు బ్యాంక్ నిర్ణయిస్తుంది, గ‌డువు కూడా అప్పుడే తెలుస్తుంది. పన్ను ఆదాతో పాటు బ్యాంక్ ఎఫ్‌డీలలో మూలధన రక్షణకు హామీ ఉంటుంది. వడ్డీ రేటు బ్యాంక్  డిపాజిట్ మొత్తాన్ని బట్టి 5 శాతం నుంచి 7 శాతం మధ్య లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే అన్ని 5 సంవత్సరాల ఎఫ్‌డీల‌పై ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌దని గుర్తుంచుకోండి. ఈ ప్రయోజనం కోసం బ్యాంకులు ప్రత్యేక పన్ను ఆదా ఎఫ్‌డీల‌ను అందిస్తున్నాయి.

సుకన్య సమృద్ధి యోజన
సాంప్రదాయక పెట్టుబడిదారుడు పన్నులను ఆదా చేయడానికి వీలుండే ప‌థ‌కాల‌లో సుకన్య సమృద్ది యోజన (ఎస్ఎస్‌వై) ఖాతా ఒకటి, ఎందుకంటే ఇది స్థిర వడ్డీ రేటును కలిగి ఉండే ప్ర‌భుత్వ ప‌థ‌కం సాంప్రదాయక పెట్టుబడిదారుడికి వారి మూలధనాన్ని భ‌ద్ర‌త‌కు, ఊహించదగిన రాబడిని పొందడానికి ఈ ఖాతా సహాయపడుతుంది. ఏదేమైనా, తల్లిదండ్రులు దీనికి దీర్ఘ‌కాల లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తును భద్రపరచాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ప‌థ‌క‌మే సుకన్య సమృద్ధి యోజన.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 10 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న ఏ ఆడపిల్లలకైనా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవవచ్చు. ఎస్ఎస్‌వై ఖాతా  ప్రారంభించిన  తేదీ నుంచి 18 సంవ‌త్స‌రాలు లేదా 21 సంవ‌త్స‌రాల వ‌య‌సులో తీసుకోవ‌చ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు డిపాజిట్ చేయ‌వ‌ల‌సి ఉంటుంది.  ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఒక‌ ఆర్థిక సంవత్సరంలో, పెట్టుబడి పెట్టవలసిన కనీస మొత్తం రూ 250, గ‌రిష్ఠ‌ పరిమితి రూ. 1.5 లక్షలు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని