పింఛను హామీతో..
close

Updated : 13/08/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పింఛను హామీతో..

దవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా పింఛను రావాలని కోరుకునే వారికి యాన్యుటీ పథకాలు అనువుగా ఉంటాయి. ఒకేసారి ప్రీమియం చెల్లించి, జీవితాంతం వరకూ పింఛను వచ్చే ఏర్పాటు ఇందులో ఉంటుంది. ఇలాంటి పాలసీలు ఇప్పటికే అనేకం అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీఎస్‌ఎల్‌ఐ) ఈ కోవలోనే కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఏబీఎస్‌ఎల్‌ఐ గ్యారంటీడ్‌ యాన్యుటీ ప్లస్‌ పేరుతో ఈ పాలసీని ఆవిష్కరించింది. పదవీ విరమణ చేసిన తర్వాత అవసరాలకు ఈ యాన్యుటీ పథకం తోడ్పడుతుందని పేర్కొంది. ఒకేసారి ప్రీమియం చెల్లించే ఈ పాలసీలో పాలసీదారుడికి పింఛను ఎంచుకునేందుకు 10 రకాల ఐచ్ఛికాలున్నాయి.

జీవితాంతం పింఛను వచ్చేలా..  పాలసీదారుడి తదనంతరం జీవిత భాగస్వామికీ పింఛను లభించేలా ఏర్పాటు చేయొచ్చు. డిఫర్డ్‌ యాన్యుటీని ఎంచుకుంటే... ఇప్పుడు పెట్టుబడి పెట్టి, పదవీ విరమణ తర్వాత పింఛను తీసుకోవచ్చు. 80 ఏళ్ల వయసు వచ్చాక యాన్యుటీని పూర్తిగా రద్దు చేసుకొని, పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. టాపప్‌ ద్వారా యాన్యుటీని పెంచుకోవడం తదితర ఆప్షన్లు ఉన్నాయి. ‘మహమ్మారి తర్వాత ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం అవుతోంది. పదవీ విరమణ చేసిన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని,క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జించాలనుకునే వారికి ఈ యాన్యుటీ ప్లాను సహాయంగా ఉంటుంది’ అని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ-సీఈఓ కమలేశ్‌ రావు తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని