ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు అధిక వ‌డ్డీ రేట్లను ఇస్తున్న ప్రైవేట్ బ్యాంకులు - 10-private-banks-offering-the-highest-FD-returns
close

Published : 03/08/2021 12:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు అధిక వ‌డ్డీ రేట్లను ఇస్తున్న ప్రైవేట్ బ్యాంకులు

కొన్ని ప్రైవేట్ బ్యాంకులు 5 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల‌కు అత్య‌ధిక రిట‌ర్న్‌ల‌ను అందిస్తున్నాయి.  ప్ర‌స్తుతం మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న కొన్ని ప్రైవేట్‌, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల కంటే కొద్దిగా ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. పెట్టుబ‌డి సౌల‌భ్యం, స్ప‌ష్ట‌మైన హామీ రాబ‌డి, వివిధ కాల‌వ్య‌వ‌ధులను ఎంచుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌టం వ‌ల్ల దేశీయంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ప్ర‌స్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్నా కూడా వీటిపై ఆధార‌ప‌డే సీనియ‌ర్ సిటిజ‌న్లు దేశంలో చాలా మంది ఉన్నారు. త‌క్కువ కాలానికి కూడా ఎఫ్‌డీలు వేయ‌డానికి అవ‌కాశం ఉండ‌టం, అవ‌స‌ర‌మైన టైమ్‌కి ఎఫ్‌డీని ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉండ‌టం కూడా వినియోగ‌దారులు ఇప్ప‌టీకీ ఈ ఎప్‌డీల‌ను ఇష్ట‌ప‌డుతుంటారు.

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక సంవ‌త్స‌రానికి పైగా రెపో రేటును క‌నిష్టంగా 4% వ‌ద్ద మార్చ‌కుండా ఉంచ‌డంతో, చాలా బ్యాంకులు త‌మ ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. పెట్టుబ‌డిదారుల ప‌న్ను స్లాబ్ రేటు ప్ర‌కారం ఎఫ్‌డీ ఆదాయాల‌కు స్లాబ్ దాటితే ఆదాయ ప‌న్ను  విధించ‌బ‌డుతుంది. ఇదొక్క‌టే బ్యాంకుల్లో ఎఫ్‌డీలు వేసేవారు ఆలోచించాల్సిన విష‌యం.

మీరు రూ. 10 ల‌క్ష‌లు ఎఫ్‌డీలో పెట్టాల‌నుకుంటే అన్నింటిని ఒకే ఎఫ్‌డీలో 5 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డి ఏక‌మొత్తంగా పెట్ట‌డానికి బ‌దులు, రూ. 2 ల‌క్షల‌ మొత్తాన్ని 5 ఎఫ్‌డీలుగా  విడ‌దీసి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. మొద‌టి ఎఫ్‌డీ కాల‌వ్య‌వ‌ధి ఒక సంవ‌త్స‌రం, రెండ‌వ‌ది 2 సంవ‌త్స‌రాలు, మూడ‌వ‌ది 3 సంవ‌త్స‌రాలు, నాల్గ‌వ‌ది 4 సంవ‌త్స‌రాలు, ఐద‌వ‌ది 5 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఎఫ్‌డీలు మెచ్యూరిటీ అయిన త‌ర్వాత మీకు సాధ్య‌మైతే మీ ఎఫ్‌డీల‌ను తిరిగి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. భ‌విష్య‌త్తులో ఏదైనా అధిక రిట‌ర్న్స్ ఆఫ‌ర్ నుండి ప్ర‌యోజ‌నం పొంద‌డానికి ఇది మిమ్మ‌ల్ని అనుమ‌తిస్తుంది. ఏదైనా కొంత మొత్తం కావాల‌న్న మొత్తం 10 ల‌క్ష‌ల ఎప్‌డీని ఉప‌సంహ‌రించ‌కుండా ముందే ఎఫ్‌డీని మూసివేయ‌వ‌ల‌సిన అవ‌స‌రాన్ని తగ్గిస్తుంది.

మీరు ఎఫ్‌డీలో పెట్టుబ‌డి పెట్టాల‌ని ఆలోచిస్తుంటే, ప్ర‌స్తుతం 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కాల వ్య‌వ‌ధికి రూ. 1 కోటి కంటే త‌క్కువ మొత్తంలో సాధార‌ణ ఎఫ్‌డీల‌పై అత్య‌ధిక వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న 10 ప్రైవేట్ బ్యాంకుల లిస్ట్ ఇక్క‌డ ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ డిపాజిటర్లు సాధార‌ణ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్ల వ‌ర‌కు అధిక రేట్ల‌ను పొందుతారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని