దిఘీపోర్టులో అదానీ ₹10వేల కోట్ల పెట్టుబడులు - Adani Ports to invest Rs 10000 cr to develop Dighi Port
close

Updated : 17/02/2021 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిఘీపోర్టులో అదానీ ₹10వేల కోట్ల పెట్టుబడులు

రూ.705 కోట్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి

దిల్లీ: ముంబయిలోని దిఘీ పోర్ట్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌(ఏపీఎస్‌ఈజెడ్‌) ప్రకటించింది. రూ.705 కోట్లకు దీన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీంతో ఏపీఎస్‌ఈజెడ్‌లో చేరిన 12వ పోర్టుగా దిఘీ పోర్ట్‌ నిలిచింది. రానున్న రోజుల్లో దీని అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌(జేఎన్‌పీటీ)కు దీన్ని ప్రత్యామ్నాయ గేట్‌వేగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపింది.

భారీ పెట్టుబడులతో దిఘీ పోర్ట్‌ను మల్టీ కార్గో పోర్ట్‌గా తీర్చిదిద్దనున్నట్లు అదానీ పోర్ట్స్‌ వెల్లడించింది. అలాగే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైలు, రోడ్డు ఎవాక్యుయేషన్‌ మౌలిక వసతుల్ని కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. దీంతో అత్యధిక పరిశ్రమలు కలిగిన మహారాష్ట్రకు నిరంతర కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుత మౌలిక వసతుల్ని బాగు చేయించడంతో పాటు డ్రై, కంటైనర్‌, లిక్విడ్‌ కార్గోని నిర్వహించేందుకు కావాల్సిన వసతుల్ని అభివృద్ధి చేస్తామని తెలిపింది.

ఏపీఎస్‌ఈజెడ్ భారత్‌లోనే అతిపెద్ద నౌకాశ్రయ అభివృద్ధి, నిర్వహణ సంస్థగా ఉంది. దేశవ్యాప్తంగా 12 వ్యూహాత్మక ప్రాంతాల్లోని పోర్టులను ఇది నిర్వహిస్తోంది. దేశంలోని పోర్టుల సామర్థ్యంలో వీటిదే 24 శాతం వాటా కావడం విశేషం. ముంద్రా, దహేజ్‌, తుణ, హజీర, ధమ్రా, మొర్ముగావ్ సహా మరికొన్ని పోర్టులు ఏపీఎస్‌ఈజెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

ఇవీ చదవండి..

ఎన్‌బీఎఫ్‌సీలపై కరోనా కాటు

ఈపీఎఫ్‌ వడ్డీ రేటులో కోత?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని