ఆర్సెలర్‌ మిత్తల్‌లో ‘కొవిడ్‌’ కోత! - ArcelorMittal announces cost reduction programme
close

Published : 12/02/2021 21:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్సెలర్‌ మిత్తల్‌లో ‘కొవిడ్‌’ కోత!

లండన్‌: ప్రపంచంలోనే దిగ్గజ ఉక్కు తయారీ సంస్థ అయిన ఆర్సెలర్‌ మిత్తల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ కార్యకలాపాల్లో ఒక బిలియన్‌ డాలర్ల ఖర్చును తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 20 శాతం మంది ఉద్యోగుల్ని కూడా తొలగించనున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌ తర్వాత నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో పోటీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఉత్పత్తి భారీగా పడిపోవడంతో సంస్థ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. తాజాగా తీసుకున్న చర్యలతో వ్యయాన్ని కట్టడి చేసి.. ఆదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పొలండ్‌, దక్షిణాఫ్రికాలో ఇప్పటికే సంస్థ కొన్ని కార్యకలాపాల్ని పూర్తిగా మూసివేసింది.

ఆర్సెలర్‌ మిత్తల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ. దాదాపు 60 దేశాల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్సెలర్‌ మిత్తల్‌ దాని అనుబంధ సంస్థలో 1,90,000 మంది పనిచేస్తున్నారు. ఉక్కు రంగ వ్యాపార దిగ్గజంగా పేరుగాంచిన లక్ష్మీ మిత్తల్‌, తన తనయుడు ఆదిత్య మిత్తల్‌కు ఆర్సెలర్‌ మిత్తల్‌ పగ్గాలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. కంపెనీలో ముఖ్య ఆర్థిక అధికారిగా (సీఎఫ్‌ఓ) ఉన్న ఆదిత్య.. ఇకపై ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్‌, సీఈఓగా ఉన్న లక్ష్మీ మిత్తల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ఆర్సెలర్‌ మిత్తల్‌ను 1976లో లక్ష్మీ మిత్తల్‌ స్థాపించారు.

ఇవీ చదవండి...

ఆదిత్య మిత్తల్‌కు ఆర్సెలర్‌ మిత్తల్‌ పగ్గాలు

చందాకొచ్చర్‌కు బెయిల్‌.. కానీ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని