10,000 నియామకాలు: యూఎస్‌టీ - Automovil employees to double
close

Published : 04/08/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

10,000 నియామకాలు: యూఎస్‌టీ

దిల్లీ: డిజిటలీకరణ సొల్యూషన్లు అందించే కంపెనీ యూఎస్‌టీ ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఇందులో 2000 ప్రారంభస్థాయి ఇంజినీరింగ్‌ ఉద్యోగాలని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే సంస్థ పేర్కొంది. భారత్‌, జర్మనీ, అమెరికా సహా పలు దేశాల్లో ఈ నియామకాలు జరుపుతామని తెలిపింది. 25 దేశాల్లో 35 కార్యాలయాలు కలిగిన ఈ సంస్థకు ప్రస్తుతం 26,000 మంది ఉద్యోగులున్నారు.

రెట్టింపు కానున్న ఆటోమొవిల్‌ ఉద్యోగులు

కార్ల విక్రయానంతర సేవలు అందించే మొబిలిటీ అంకుర సంస్థ ఆటోమొవిల్‌, ఈ ఆర్థిక సంవత్సరం చివరకు ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. ప్రస్తుతం 70 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, మార్చి కల్లా 125కు చేర్చాలన్నది ప్రణాళికగా సంస్థ సీఈఓ మహేంద్రదాస్‌ తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని