‘వేదాంతా’లో వాటాపెంపుపై అనిల్‌అగర్వాల్‌ దృష్టి - Billionaire Anil Agarwal sweetens offer for Vedanta Ltd shares
close

Updated : 17/03/2021 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వేదాంతా’లో వాటాపెంపుపై అనిల్‌అగర్వాల్‌ దృష్టి

ఇంటర్నెట్‌డెస్క్‌: అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంతా రిసోర్సెస్‌ భారత్‌లోని వేదాంతా లిమిటెడ్‌లో వాటాలను మరింత పెంచుకోనుంది. దీనిలో మరో 17.51శాతం వాటాల కొనుగోలుకు అనుమతులు కోరుతూ మంగళవారం ఎక్స్ఛేంజీలో ఫైలింగ్‌ దాఖలు చేసింది. ఒక్కో షేరుకు రూ.235(3.24 డాలర్లు) చెల్లించేందుకు సిద్ధపడింది. గతంలో 10 శాతం వాటాలు కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన రూ.160 కంటే ఈ మొత్తం చాలా ఎక్కువ. ప్రస్తుతం వేదాంతా రిసోర్సెస్‌కు వేదాంత లిమిటెడ్‌లో 55శాతం వాటాలు ఉన్నాయి.

బుధవారం భారతీయ స్టాక్‌మార్కెట్లలో వేదాంత రూ.226.5 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. దీనికంటే తాజా ఆఫర్‌లో పేర్కొన్న రూ.235 స్వల్పమొత్తం ఎక్కువ. ఈ డీల్‌ పూర్తయితే వేదాంతా లిమిటెడ్‌పై అనిల్‌ అగర్వాల్‌కు పూర్తి స్థాయిలో పట్టు వచ్చేస్తుంది. గతంలో వేదాంత లిమిటెడ్‌ను టేకోవర్‌ చేయడానికి అనిల్‌ అగర్వాల్‌ దాఖలు చేసిన బిడ్‌ను వాటాదారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వేదాంతాలోని మొత్తం 651 మిలియన్ల షేర్లను కొనుగోలు చేయాలంటే రూ.15.3 వేల కోట్లను వెచ్చించాలి. తాజా ఆఫర్‌ మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 7 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇవీ చదవండి

ఇలా అయితే మీరు కోటీశ్వరులు కాలేరు!
వారసులకు బాధ్యతలు అప్పగిద్దామా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని