మార్చిలో FPI పెట్టుబడులు రూ.17,304కోట్లు - FPIs net buyers for 3rd month in a row
close

Updated : 04/04/2021 22:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చిలో FPI పెట్టుబడులు రూ.17,304కోట్లు

దిల్లీ: మార్చి నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐ) భారత మార్కెట్లో రూ.17,304 కోట్ల పెట్టుబడులు పెట్టారు. వరుసగా మూడో నెలా ఎఫ్‌పీఐలే నికర కొనుగోలుదారులుగా నిలిచారు. డిపాజిటరీస్‌ సమాచారం ప్రకారం.. రూ.10,482 కోట్లు ఈక్విటీల్లోకి.. రూ.6,822 కోట్లు డెట్‌ విభాగంలోకి పెట్టుబడులుగా వచ్చాయి. ఇక ఎఫ్‌పీఐలు ఫిబ్రవరిలో రూ.23,663 కోట్లు, జనవరిలో రూ.14,649 కోట్లు భారత మార్కెట్లోకి పెట్టుబడులుగా తరలించిన విషయం తెలిసిందే. 

దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటం భారత్‌లో పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నట్లు గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఓఓ హర్ష్‌ జైన్‌ తెలిపారు. అయితే, గతంతో పోలిస్తే మార్కెట్లు స్థిరంగానే ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుండడం, ఆర్థిక వ్యవస్థ బలమైన పునరుత్తేజం.. మార్కెట్లకు అండగా నిలుస్తున్నాయన్నారు. 

అలాగే ప్రపంచ మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరిగిందని.. అవి భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి పెట్టుబడులుగా మళ్లుతున్నాయని మార్నింగ్‌స్టార్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే, దేశీయంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎఫ్‌పీఐలు కాస్త అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని హెచ్చరించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని