వెనక్కి తగ్గుతున్న ఎఫ్‌పీఐలు! - FPIs turn net sellers
close

Published : 07/03/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెనక్కి తగ్గుతున్న ఎఫ్‌పీఐలు!

దిల్లీ: గత కొన్ని నెలలుగా భారత స్టాక్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐ) మార్చి తొలి వారంలో కాస్త వెనకడుగు వేశారు. ఈ నెల తొలి వారంలో మొత్తంగా రూ.5,156 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వీటిలో రూ.881 కోట్లు ఈక్విటీల నుంచి కాగా.. రూ.4,275 కోట్లు డెట్‌ మార్కెట్‌లోనివి. అంతకుముందు జనవరిలో నికరంగా రూ.23,663 కోట్లు, ఫిబ్రవరిలో 14,649 కోట్లు ఎఫ్‌పీఐలు భారత్‌లో పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుండడం, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం, బడ్జెట్‌లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో మార్కెట్లు ఇటీవల జీవితకాల గరిష్ఠాలను తాకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని మార్నింగ్‌స్టార్‌ ఇండియా ప్రతినిధి హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. అలాగే అమెరికాలో బాండ్ల మార్కెట్ల రాబడులు పెరగడం కూడా పెట్టుబడుల ఉపసంహరణకు కారణమైందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

తొలి ట్వీట్‌కు రూ.18.30 కోట్లు!

రూ.1,500 కోట్లతో బీపీసీఎల్‌ పైప్‌లైన్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని