తగ్గిన బంగారం ధర - Gold price plunges Rs 661per 10 grams
close

Published : 12/02/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తగ్గిన బంగారం ధర

దిల్లీ: దేశంలో బంగారం ధర మరోసారి తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో పది గ్రాముల మేలిమి పసడి ధర రూ.661 తగ్గి 46,847కి చేరింది. వెండి సైతం కిలోకు రూ.347 తగ్గింది. దిల్లీలో దీని ధర రూ.67,894కి చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడం, రూపాయి విలువ స్వల్పంగా కోలుకోవడం దేశంలో బంగారం ధరల తగ్గుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. డాలరు విలువ పెరగడం అంతర్జాతీయంగా బంగారం విలువ తగ్గడానికి కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1815 డాలర్లు ఉండగా.. వెండి 26.96 డాలర్లు ఉంది.

ఇవీ చదవండి..
గృహ బీమాలో ఏముంటాయ్‌? క్లెయిం ఎలా?
పెట్రో మంటలకు కారణాలివే..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని