close

Published : 11/04/2021 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పింఛను రంగంలోకీ 74 శాతం ఎఫ్‌డీఐలు?

పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ను వేరుచేసే యోచన

దిల్లీ: బీమా రంగం వలే పింఛన్ల రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. బీమా రంగంలోకి 74 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ గత నెలలోనే పార్లమెంటులో బిల్లు చట్టంగా మారిన విషయం తెలిసిందే.

పింఛను రంగంలో ప్రస్తుతం ఉన్న 49 శాతం ఎఫ్‌డీఐల పరిమితిని పెంచాలంటే ‘పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) యాక్ట్‌-2013లో సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సవరణ బిల్లునే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ బిల్లులో పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి నేషనల్‌ పెన్షన్‌ సిస్టం(ఎన్‌పీఎస్‌) ట్రస్ట్‌ను వేరు చేసే సవరణను కూడా పొందుపరచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ వద్ద ఉన్న అధికారాలు, విధులన్నింటినీ ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ లేదా కంపెనీల చట్టం పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి దీన్ని పూర్తిగా వేరు చేసి 15 మంది సభ్యులతో కూడిన ఓ బోర్డుని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని