​​​​​​హోండా నుంచి కొత్త బైక్‌.. ధర ₹37.2 లక్షలు! - HMSI drives in 2021 Gold Wing Tour price starts at Rs 37.2 lakh
close

Published : 16/06/2021 20:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​హోండా నుంచి కొత్త బైక్‌.. ధర ₹37.2 లక్షలు!

దిల్లీ: హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తన సరికొత్త సూపర్‌ బైక్‌ ‘గోల్డ్‌ వింగ్‌ టూర్‌’ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. జపాన్‌లోనే పూర్తిగా తయారై ఇక్కడి మార్కెట్లోకి వస్తోంది. 1833 సీసీ సామర్థ్యం కలిగిన సరికొత్త గోల్డ్‌ వింగ్‌ టూర్‌- 2021 రెండు వేరియంట్లలో వస్తోంది. సెవెన్‌ స్పీడ్‌ డ్యూయల్‌ ట్రాన్స్‌మిషన్‌తో ఎయిర్‌బ్యాగులతో కూడిన వేరియంట్‌ ధరను రూ.39,16,055 (ఎక్స్‌షోరూమ్‌-గురుగ్రామ్‌)గా కంపెనీ నిర్ణయించింది. సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న వేరియంట్‌ ధరను రూ.37,20,342గా పేర్కొంది. 

ఈ బైక్‌లో ఎలక్ట్రిక్ట్‌ స్క్రీన్‌, డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫాగ్‌ లైట్స్‌, క్రూయజ్‌ కంట్రోల్‌, ఏడు అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ లిక్విడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే, తేలికపాటి స్పీకర్లు, హిల్‌స్టార్ట్‌ సదుపాయం వంటివి ఉన్నాయి. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకు ఇది సపోర్ట్‌ చేస్తుంది. దీనిద్వారా వాహనదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని టెలిఫోన్‌ నంబర్లు, మ్యూజిక్‌ ప్లే లిస్ట్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. బ్లూటూత్‌ కనెక్టివిటీతో పాటు, రెండు యూఎస్‌బీ టైప్‌-సి పోర్టులు కూడా ఉన్నాయి. 1975 నుంచి దశాబ్దాలుగా టూవీలర్‌ పర్యాటక ప్రయాణంలో గొప్ప అనుభూతిని పంచుతోందని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్‌, సీఈవో అత్సుషి ఒగాటా పేర్కొన్నారు. లగ్జరీ ప్రయాణానికి పేరొందిన గోవింగ్‌ టూర్‌.. అధునాతన ఫీచర్లతో, సరికొత్త డిజైన్లో వస్తోందని హెచ్‌ఎంఎస్‌ఐ డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) యద్వీందర్‌ సింగ్‌ గులేరియా పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని