​​​​​​Hero motocorp: ఎలక్ట్రిక్‌ విభాగంలోకి హీరో - Hero MotoCorp all set to enter electric segment next year
close

Updated : 16/05/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​Hero motocorp: ఎలక్ట్రిక్‌ విభాగంలోకి హీరో

దిల్లీ: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఈ సంస్థ నుంచి వచ్చే ఏడాది ఓ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనం రానుందని హీరో మోటోకార్ప్‌ సీఎఫ్‌వో నిరంజన్‌ గుప్తా వెల్లడించారు. సొంత టెక్నాలజీతో ఈ వాహనం తీసుకొచ్చేందుకు రాజస్థాన్‌, జర్మనీలో ఉన్న తన ఆర్‌అండ్‌డీ విభాగాల సేవలను వినియోగించుకుంటోంది. అదే సమయంలో బ్యాటరీ స్వాపింగ్‌ (బ్యాటరీ ఇచ్చి ఛార్జైన బ్యాటరీ తీసుకోవడం) వేదికను దేశంలోకి తీసుకొచ్చేందుకు తైవాన్‌కు చెందిన గొగోర్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. హీరో బ్రాండ్‌ పేరుమీద వాహనాలు తీసుకొచ్చేందుకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కూడా కుదిరింది.

2022 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని తీసుకురానున్నట్లు నిరంజన్‌ గుప్తా వెల్లడించారు. అది తమ సొంత ఉత్పత్తి అయినా, గొగొర్‌ కంపెనీ సహకారంతో అయినా కావొచ్చని చెప్పారు. ఫిక్స్‌డ్‌ ఛార్జింగ్‌ కోసం కంపెనీకి చెందిన జర్మనీ, జైపూర్‌ ఆర్‌అండ్‌డీ విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో గొగోర్‌తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. బ్యాటరీ స్వాపింగ్‌ విషయంలో గొగోర్‌కు విశేషానుభవం ఉందని, తైవాన్‌లో ఇప్పటికే నిరూపితమైందని చెప్పారు. అయితే వచ్చే ఏడాది ఎప్పుడొచ్చేదీ కచ్చితంగా చెప్పలేనప్పటికీ తమ సంస్థ నుంచి మాత్రం వచ్చే క్యాలెండర్‌ సంవత్సరంలో ఓ ఎలక్ట్రిక్‌ వాహనం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కొత్త ఉత్పత్తుల విడుదలపై కరోనా మహమ్మారి ప్రభావం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఐదేళ్లకు సంబంధించి వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఉత్పత్తులను విడుదల చేస్తామని పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని