ITR: ఐటీఆర్‌-1 ఎవ‌రు దాఖ‌లు చేయొచ్చు.. ఎవ‌రు దాఖ‌లు చేయ‌కూడ‌దు? - Income Tax Return Filling who can use ITR-1
close

Updated : 25/08/2021 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ITR: ఐటీఆర్‌-1 ఎవ‌రు దాఖ‌లు చేయొచ్చు.. ఎవ‌రు దాఖ‌లు చేయ‌కూడ‌దు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐటీఆర్‌-1 ఫారంను స‌హ‌జ్ అని కూడా అంటారు. ప‌న్ను చెల్లింపుదారుల్లో చాలా మంది ఈ ఫారాన్ని ఉప‌యోగిస్తారు. ఇది ముఖ్యంగా వేత‌న జీవుల‌కు, రూ.50 ల‌క్ష‌లలోపు ఆదాయం క‌లిగిన భారత పౌరుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. డివిడెండ్ నుంచి వ‌చ్చిన ఆదాయం రూ.10 ల‌క్ష‌లు దాటితే ఐటీఆర్‌-1 ఫారం దాఖ‌లు చేసేందుకు వీల్లేదు. రూ.10 ల‌క్ష‌లలోపు డివిడెండ్ ఆదాయంపై షేర్‌ హోల్డ‌ర్ల చేతిలో ప‌న్ను ఉండ‌దు. ఐటీర్‌-1 ఫారాన్ని వ్య‌క్తులు (హెచ్‌యూఎఫ్ కాదు) దాఖ‌లు చేయొచ్చు.

ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించాలి. మీ ఆదాయానికి ఏ ఫారం స‌రిపోతుందో దానిని మాత్ర‌మే తీసుకొని దాఖ‌లు చేయాలి. మీ ఆదాయ‌ మార్గాలు, ఆస్తుల‌ను బ‌ట్టి ఐటీర్‌-1 నుంచి ఐటీఆర్‌-7 వ‌ర‌కు ఏది మీకు వ‌ర్తిస్తుందో తెలుసుకోవాలి.

ఐటీఆర్-1 ఎవ‌రికి?
వేత‌నం లేదా పింఛ‌ను ద్వారా ఆదాయం పొందే వారు ఐటీఆర్‌-1 ద్వారా రిట‌ర్నులు చెల్లించాలి. ఇంటి అద్దె, ఇత‌ర మార్గాల ద్వారా (లాట‌రీలు లేదా ఇత‌ర ఆదాయం) మొత్తం ఆదాయం క‌లిపి రూ.50 లక్ష‌ల‌కు మించ‌ని వారికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో భార్య లేదా భ‌ర్త లేదా మైన‌ర్ పిల్ల‌ల పేరు మీద ఉన్న ఆదాయం కూడా క‌లిపి దాఖ‌లు చేయొచ్చు.

ఐటీఆర్-1 ఎవ‌రికి కాదు?
గ‌తంలో ఐటీఆర్‌-1ను విదేశాల్లో ఉన్న వారికి లేదా ఎన్ఆర్‌ఐలకు ఐటీఆర్‌-1ను ఉప‌యోగించేందుకు వీల్లేదు. డివిడెండు లేదా మూల‌ధ‌న ఆదాయం రూ.10 లక్ష‌లు దాటిన వారు దీనికి ఆర్హులు కారు. దేశంలో ఉన్న‌వారికి ఇత‌ర దేశాల్లో ఆస్తులు ఉన్నా, విదేశాల‌ నుంచి ఆదాయం పొదుతున్నా వారికి ఐటీఆర్‌-1 ఫారం ఉప‌యోగించ‌కూడ‌దు.

స‌రైన ఐటీఆర్-1 ఫారాన్ని ఎంచుకోక‌పోతే ఆదాయ శాఖ‌ మీ రిట‌ర్నులు లెక్క‌లోకి తీసుకోదు. అందుకే ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మీకు ఐఆటీర్ గురించి తెలియ‌క‌పోతే ఆర్థిక స‌ల‌హాదారులు, నిపుణులు, ప‌న్ను అధికారుల నుంచి స‌ల‌హా తీసుకోండి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని