Indigo: టీకా వేసుకుంటే.. టికెట్‌పై డిస్కౌంట్‌ - IndiGo offers discount for vaccinated passengers
close

Updated : 23/06/2021 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Indigo: టీకా వేసుకుంటే.. టికెట్‌పై డిస్కౌంట్‌

‘వ్యాక్సిఫేర్‌’ పథకం ప్రారంభించిన ఇండిగో

దిల్లీ: ప్రజలంతా కరోనా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికులను ఆకర్షించేలా దేశీయ అతిపెద్ద బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. వ్యాక్సిన్‌ వేసుకున్నవారికి విమాన టికెట్లపై 10శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ మేరకు ‘వ్యాక్సిఫేర్‌’ పేరుతో కొత్త ఆఫర్‌ను బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

‘‘18ఏళ్ల పైబడి వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. టికెట్‌ బుక్‌ చేసుకున్న సమయానికి భారత్‌లో ఉండి రెండు డోసులు లేదా కనీసం ఒక్క డోసు తీసుకున్న వారు ఈ డిస్కౌంట్‌ పొందొచ్చు. టీకా తీసుకొన్న వారికి బేస్‌ ధరపై 10శాతం రాయితీ ఇస్తున్నాం’’ అని ఇండిగో తెలిపింది. అయితే, ఈ ఆఫర్‌ను వినియోగించుకున్న వారు.. తమ వెంట కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన టీకా ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది. ఎయిర్‌పోర్టు చెకిన్‌ కౌంటర్‌, బోర్డింగ్‌ గేటు వద్ద ఈ ధ్రువీకరణ పత్రాలను చూపించాలని, లేదా ఆరోగ్య సేతు యాప్‌లో వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను కూడా చూపించొచ్చని ‘ఇండిగో’ వెల్లడించింది. అన్ని రకాల ప్రయాణాలు, టికెట్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. 

ఈ సందర్భంగా ఇండిగో చీఫ్‌ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా.. జాతీయ టీకా పంపిణీ విధానానికి మా వంతు సహకారం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. మనందరి లక్ష్యాన్ని చేరుకునేందుకుగానూ ప్రజలంతా టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని అనుకున్నాం’’ అని తెలిపారు.



మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని