దేశీయ సూచీలకు ప్రపంచ మార్కెట్ల అండ - Markets are in green
close

Updated : 23/03/2021 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశీయ సూచీలకు ప్రపంచ మార్కెట్ల అండ

ముంబయి: అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 49,876, వద్ద, నిఫ్టీ 14,768 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:38 గంటల సమయానికి సెన్సెక్స్‌ 243 పాయింట్లు లాభపడి 49,997 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 69 పాయింట్లు ఎగబాకి 14,804 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.40 వద్ద కొనసాగుతోంది.  

టెక్‌ షేర్ల అండతో అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో కదలాడుతున్నాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ దాదాపు 50 పాయింట్లకు పైగా ట్రేడవుతోంది. వీటితో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది. 

దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. టీసీఎస్‌, సన్‌ ఫార్మా, విప్రో లిమిటెడ్‌, యూపీఎల్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐఓసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, బ్రిటానియా, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని