close
Array ( ) 1

తాజా వార్తలు

మార్కెట్లోకి మారుతీ ఇగ్నిస్‌ న్యూ వెర్షన్‌

దిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ తన ఇగ్నిస్‌ మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును ఆటోఎక్స్‌పో-2020లో ప్రదర్శనకు ఉంచింది. బీఎస్‌-6 ఇంజిన్‌తో వచ్చే ఈ కారు ప్రారంభ ధర రూ.4.89లక్షల(దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో) నుంచి రూ.6.72 లక్షల వరకూ ఉంది. ఇక ఆటోగేర్‌ వేరియంట్‌ ధర రూ.6.13లక్షల నుంచి రూ.7.19లక్షలుగా ఉంది. ఈ సరికొత్త కారు కేవలం పెట్రోల్‌ ఇంజిన్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. లుక్స్‌లో ఈ కారులో స్వల్ప మార్పులు చేశారు. క్రోమ్‌ గ్రిల్‌, సరికొత్త బంపర్‌, స్కిడ్‌ ప్లేట్లు, దీంతోపాటు రూఫ్‌ రెయిల్స్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 

ఈ కారులో బీఎస్‌-6 మోడల్‌ 1.2లీటర్ ఫోర్‌ సిలిండర్‌ వీవీటీ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇదే ఇంజిన్‌ను స్విఫ్ట్‌, బాలినోలలో కూడా వినియోగిస్తున్నారు. ఇది 82 బీహెచ్‌పీ శక్తి, 113ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనిలో 5స్పీడ్‌ మాన్యూవల్‌, ఏఎంటీ గేర్‌ బాక్స్‌ మోడళ్లలో లభిస్తోంది. ఈ కొత్త మోడల్‌ ఆరు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. వీటిల్లో లూసెంట్‌ ఆరెంజ్‌, న్యూ టర్కోయిస్‌ రంగులు ఉన్నాయి. దీంతోపాటు డ్యూయల్‌ టోన్‌ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ కెన్చీ ఐకవా మాట్లాడుతూ.. ఎస్‌యూవీ తలపించేలా డిజైన్‌ చేసిన సరికొత్త ఇగ్నిస్‌ కస్టమర్లను ఆకట్టుకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.