logo

ఆంధ్రాలో ఓటుంది.. తపాలా ఓటును పంపండి

నగరంలో ఎన్నికల విధులకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగంపై అయోమయంలో పడ్డారు. హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌కు వరుస కట్టిన వినతులే అందుకు నిదర్శనం.

Updated : 05 May 2024 07:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఎన్నికల విధులకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగంపై అయోమయంలో పడ్డారు. హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌కు వరుస కట్టిన వినతులే అందుకు నిదర్శనం. బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా శాఖల్లో పనిచేస్తోన్న సుమారు 300 మంది ఉద్యోగులు హైదరాబాద్‌ జిల్లాలో ఎన్నికల విధులకు ఎంపికయ్యారు. ఈసీ తపాలా ఓటు ఫారం-12ను అందించగా.. దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక యంత్రాంగం తెలంగాణ ఉద్యోగుల వివరాలను ఆయా పార్లమెంటు స్థానాల ఆర్వోలకు పంపించింది. ఏపీ ఉద్యోగుల తపాలా ఓటుపై మాత్రం ఎటూ తేల్చలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ నెల 8 వరకు ఆంధ్రాలో తపాలా ఓటుకు అవకాశం ఉందని, వివరాలను ఏపీ ఎన్నికల సంఘం ద్వారా నియోజకవర్గాల ఆర్వోలకు చేరవేస్తే.. తాము వెళ్లి ఓటు వేస్తామని ఉద్యోగులు జీహెచ్‌ఎంసీని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని