అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
ఇంటర్నెట్ డెస్క్: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కార్ల గ్యారేజీలో కొత్త కార్లు చేరాయి. 2021 ఆరంభంలోనే మూడు అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీలు డెలివరీ అయ్యాయి. తాజాగా భారత్‌లో అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కూడా అంబానీ కార్లలో ఒకటైపోయింది. విలాసంతో పాటు పెర్ఫార్మెన్స్, భద్రత ఈ కారు సొంతం.
2018లో భారత్‌కు తెచ్చిన రోల్స్ రాయిస్ కల్లినన్‌కు మరిన్ని అధునాతనమైన మెరుగులు దిద్ది కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌గా తీసుకొచ్చారు. దీన్ని 2020లో విడుదల చేశారు. రెండు కల్లినన్ మోడళ్లను సొంతం చేసుకున్న తొలి భారతీయుడు ముకేశ్ అంబానీయేనని సమాచారం. బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ ధర రూ.8.20 కోట్లుగా (ఎక్స్ షోరూం) ఉంది. ఇక దీన్ని రోడ్డు పైకి తీసుకురావాలంటే మొత్తం రూ.10కోట్ల పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక కలర్, ఇంటీరియర్స్ మన అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దాలంటే మరింత సొమ్ము చెల్లించాల్సిందే. సాధారణంగా ముకేశ్ అంబానీ ఆయన కార్లలో చాలా మార్పులు చేయించుకుంటుంటారు.
ఇక ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. 6.75 లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్-టర్బో వీ12 ఇంజన్ ఇందులో ఉంది. బేసిక్ కల్లినన్‌తో పోల్చితే ఈ కారు మరింత శక్తిమంతమైంది. గరిష్ఠంగా 592 హెచ్‌పీ శక్తిని, 900 ఎన్ఎమ్ టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇక 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు గంటకు 100 కి.మీ వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. ఎడారి, అడవి, బురద, కొండ ప్రాంతం ఇలా ఎలాంటి ప్రాంతంలోనైనా దూసుకుపోయేలా దీన్ని రూపొందించారు. ఇక కారు ఇంటిరియర్స్లోని పైభాగాన్ని నక్షత్రాల్ని తలపించే ప్రత్యేక డిజైనింగ్ ఆకట్టుకుంటుంది.
బ్లాక్బ్యాడ్జ్తో పాటు రోల్స్ రాయిస్‌కు చెందిన ఫాంటమ్ VIII, ఫాంటమ్ డీహెచ్సీ వంటి అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లు అంబానీ గ్యారేజ్‌లో ఉన్నాయి. వీటితో పాటు బెంట్లీ బెంటెగా, మసెరటి లెవంటి కార్లు కూడా ఈ ఏడాదే అంబానీ ఇంట్లో చేరాయి. వీటన్నింటినీ ఆయన 2020లో ఆర్డర్ చేయగా.. ఇప్పుడు డెలివరీ అయినట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటు బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారీ 812, మెక్లారెన్ 520ఎస్ స్పైడర్, లాంబోర్గినీ అవెంటడర్ ఎస్ రోడ్‌స్టర్, ఫెరారీ 488 జీటీబీ, ఫెరారీ పోర్టోఫినో, యాస్టన్ మార్టిన్ డీబీ11 వంటి సూపర్ కార్లు ముకేశ్ అంబానీ కుటుంబం వాడే కార్లలో కొన్ని.
ఇవీ చదవండి...
బీఎండబ్ల్యూ నుంచి రూ.24లక్షల బైక్!
6 ఎయిర్‌బ్యాగ్‌లతో టాటా సఫారీ..ధర ఎంతంటే?
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?