Savings Schemes: అధిక వ‌డ్డీనిచ్చే సుర‌క్షిత‌మైన పొదుపు ప‌థ‌కాలు - PPF-to-NSC-best-government-savings-schemes
close

Updated : 22/07/2021 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Savings Schemes: అధిక వ‌డ్డీనిచ్చే సుర‌క్షిత‌మైన పొదుపు ప‌థ‌కాలు

ఇంటర్నెట్‌ డెస్క్: దేశీయంగా పేరెన్నికగ‌న్న పొదుపు ప‌థ‌కాలు `పీపీఎఫ్‌` నుంచి `నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్స్ (ఎన్ఎస్‌సీ)` వ‌ర‌కు అనేకం ఉన్నాయి. ఇవి మార్కెట్ అస్థిర‌త‌తో ప్ర‌భావితం కానందున‌, స్థిర మ‌దుపుదార్ల‌కు సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డికి మార్గాలుగా ఉన్నాయి. ఈ పొదుపు ప‌థ‌కాలు ప‌ద‌వీ విర‌మ‌ణ, పిల్ల‌ల విద్య‌, వివాహం మొద‌లైన ద‌శ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, జీవితంలో వివిధ ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుపుదార్ల‌ను ప్రొత్స‌హిస్తాయి. అందులో ముఖ్య‌మైన‌వి కొన్ని.. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌, పోస్ట్ ఆఫీస్ రిక‌రింగ్ డిపాజిట్‌, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌, కిసాన్ వికాస్ ప‌త్రాలు మొద‌లైన‌వి. ఈ ప్ర‌భుత్వ పొదుపు ప‌థ‌కాలు చాలా న‌మ్మ‌ద‌గిన‌వి, సుర‌క్షిత‌మైన‌వి. కాబ‌ట్టి మ‌దుపుదార్ల‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో కొన్ని దీర్ఘ‌కాలిక సంప‌ద సృష్టికి అనువైన‌వి.  ఈ పెట్టుబ‌డి ఎంపిక‌ల్లో కొన్ని లాక్‌-ఇన్ పీరియ‌డ్‌, ద్ర‌వ్యోల్బ‌ణాన్ని బట్టి రాబ‌డి ఇస్తాయి. అయితే ఈ పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు త్రైమాసికానికి, అర్ధ సంవ‌త్స‌రానికి సవరణకు గురవుతుండవచ్చు.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)

ఒక వ్య‌క్తి క‌నీసం ఈ ఖాతాలో రూ. 500 నుంచి గ‌రిష్టంగా ఏడాదికి రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ప్ర‌స్తుతం వ‌డ్డీరేటు 7.1%.  మ‌దుపుదార్ల‌కు రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టే పెట్టుబ‌డికి ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ)

ఇందులో క‌నీసం రూ. 1000 పెట్టుబ‌డి పెట్ట‌వచ్చు. దీనికి ల‌భించే వ‌డ్డీరేటు 6.8%. రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్‌పై ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా

ఇందులో క‌నీస పెట్టుబ‌డి రూ. 500తో ప్రారంభించ‌వ‌చ్చు. ల‌భించే వ‌డ్డీ రేటు  ఏడాదికి 4%. ఈ పొదుపు ఖాతాతో పొందిన వ‌డ్డీకి ఆదాయ ప‌న్నుమినహాయింపు ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్

ఇందులో క‌నీస పెట్టుబ‌డి రూ. 1000, గ‌రిష్ట పెట్టుబ‌డికి ప‌రిమితి లేదు.  దీంట్లో ల‌భించే వ‌డ్డీ రేటు మొద‌టి 3 సంవ‌త్స‌రాల‌కైతే 5.5%, 5 ఏళ్లకైతే 6.7%. డిపాజిట్లపై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961 సెక్ష‌న్ 80 సి కింద ఐదేళ్ల వ‌ర‌కు ఉంది పన్ను మినహాయింపు ఉంది.

పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్

ఇందులో క‌నీసం రూ. 100 పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. డిపాజిట్ సింగిల్‌గా, జాయింట్‌గా కూడా చేయ‌వ‌చ్చు. ల‌భించే వ‌డ్డీ రేటు 5.8%. వ‌డ్డీకి ఆదాయ ప‌న్ను ఉంటుంది.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్

క‌నీసం రూ. 1000 పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఒక ఖాతాలో గ‌రిష్టంగా రూ. 4.5 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాలో రూ. 9 ల‌క్ష‌ల వరకు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఏడాదికి ల‌భించే వ‌డ్డీ రేటు 6.6%. ఇది ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. డిపాజిట్ల‌పై ప‌న్ను మిన‌హాయింపులు లేవు.

కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ)

ఒక వ్య‌క్తి ఇందులో కనీసంగా రూ. 1000 నుంచి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. పెట్టుబ‌డికి గ‌రిష్ట ప‌రిమితి లేదు. ల‌భించే వ‌డ్డీ రేటు ఏడాదికి 6.9%. ఇందులో పెట్టిన పెట్టుబ‌డి రెట్టింపు కావాలంటే 10 సంవ‌త్స‌రాల 4 నెల‌లు పడుతుంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని