యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం - Perfect health with yoga practice
close

Updated : 22/06/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

యోగా దినోత్సవంలో కార్పొరేట్లు

దిల్లీ: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సమతుల్య జీవన ఆవశ్యకతను భారత కార్పొరేట్లు నొక్కిచెప్పారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా సాధన దోహదపడుతుందని, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కొవిడ్‌ సంక్షోభ పరిస్థితుల్లో యోగా అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇళ్లలో, కార్యాలయాల్లో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రభుత్వ రంగ సంస్థలు సైతం పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ‘సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా’ సందేశాన్ని పంపించారు. పలువురు కార్పొరేట్‌ ప్రముఖులు చేసిన ట్వీట్‌ ఇలా..

‘వృత్తిగతంగా, వ్యక్తిగతంగా మన ఆలోచనా విధానంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా మనసుపై ప్రభావం చూపుతుంది. దృష్టి, టీమ్‌ వర్క్‌, వృద్ధి, శాంతి వంటి వాటిపై దృష్టి పెట్టేందుకు సహకరిస్తుంది’

- హీరానందానీ గ్రూప్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ హీరానందానీ


‘ ప్రారంభం నుంచి ఇండిగో సంస్కృతిలో ఆరోగ్యం, సంరక్షణ అంతర్గత భాగంగా ఉంది. శరీరం, మనసులను తగిన విధంగా ఉంచుకోవడానికి యోగా అత్యుత్తమ మార్గం. ప్రజలు యోగాకు చేరువ చేసేందుకు బెండ్‌ఇట్‌లైక్‌6ఈ పేరుతో సామాజిక మాధ్యమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. ఉద్యోగులు, వారి కుటుంబాలకు యోగా సెషన్లను నిర్వహించేందుకు ఇన్ఫీనిట్‌ హెల్త్‌ స్టుడియోస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’

- ఇండిగో సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌ రాజ్‌ రాఘవన్‌

వీరితో పాటు ఐఓసీ ఛైర్మన్‌ ఎస్‌ఎం వైద్య, బీపీసీఎల్‌ సీఎండీ కె.పద్మాకర్‌, హెచ్‌పీసీఎల్‌ సీఎండీ, ఓఎన్‌జీసీ ఛైర్మన్‌ సుభాష్‌ కుమార్‌, టాటా గ్రూప్‌, మారికో ఛైర్మన్‌ హర్ష్‌ మారివాలా, వేదాంతా నవీన్‌ అగర్వాల్‌, కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హీరో ఎలక్ట్రిక్‌, గోద్రేజ్‌ అండ్‌ బోయ్స్‌లు యోగా ఆవశ్యకతను ట్విటర్‌ వేదికగా తెలియజేశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని