బ్యాంకుల యజమానులతో శక్తికాంతదాస్‌ భేటీ - RBI Governor Shaktikanta Das Meets Heads Of Small Finance Banks
close

Published : 30/04/2021 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకుల యజమానులతో శక్తికాంతదాస్‌ భేటీ

ముంబయి: దేశంలోని వివిధ బ్యాంకుల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలతో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ భేటీ అయ్యారు. వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ భేటీలో బ్యాలెన్స్‌ షీట్ల అంశంపై చర్చించారు. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల స్థానికంగా లాక్‌డౌన్‌ విధించడంతో బ్యాలెన్స్‌ షీట్ల తయారీలో ఎదురయ్యే ఒత్తిడి తదితర అంశాలపై చర్చించినట్లు ఆర్బీఐ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారికి సూక్ష్మ తరహా బ్యాంకులు ఎంతగానో దోహదపడతాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. ఆయా బ్యాంకులు ఎలా స్థిరత్వం పొందాలి? ఒకవేళ నష్టాల బాటపట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను గవర్నర్‌ నొక్కి చెప్పారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారి ఆసక్తికి అనుగుణంగా సాంకేతికతపై దృష్టిసారించాలని కోరారు. ఈ సమావేశానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం.కె.జైన్‌, ఎండీ పాత్రా, రాజేశ్వరరావు, ఆర్బీఐ ఉన్నతాధికారులు హాజరయ్యారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని