Stock Market: రోజంతా మందకొడిగానే! - Stock market ended on a flat note
close

Updated : 08/06/2021 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: రోజంతా మందకొడిగానే!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం రోజంతా స్తబ్దుగానే కదలాడాయి. ఓ దశలో 52,135 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ తిరిగి కోలుకున్నప్పటికీ.. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేకపోయింది. నిఫ్టీ సైతం అదే తీరును కొనసాగించింది. చివరకు సెన్సెక్స్‌ 52 పాయింట్లు నష్టపోయి 52,275 వద్ద ముగియగా.. నిఫ్టీ 11 పాయింట్లు కుంగి 15,740 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.88 వద్ద నిలిచింది. ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కరోనా టీకా అందించనుందన్న వార్త మదుపర్లను అప్రమత్తతకు గురిచేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడనుందనే వార్త సూచీలను కాస్త నిరాశపరిచింది. సూచీలు గరిష్ఠాలకు చేరుకోవడంతో మదుపర్లు కీలక రంగాల్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు మందకొడిగా ముందుకు సాగాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, మారుతీ షేర్లు లాభాల్లో ముగియగా.. కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రిలయన్స్ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని