Stock market: మందకొడిగా సూచీలు - Stock market indices trading on a flat note
close

Updated : 09/06/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: మందకొడిగా సూచీలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ స్తబ్ధుగానే ప్రారంభమయ్యాయి. కాసేపు స్వల్ప లాభాల్లోకి జారుకున్నప్పటికీ వెంటనే తిరిగి నష్టాల బాట పట్టాయి. బుధవారం ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 59 పాయింట్లు నష్టపోయి 52,216 వద్ద ట్రేడవుతుండగా.. 9  పాయింట్ల నష్టంతో 15,730 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.91 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌రెడ్డీస్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంకు, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ, టైటన్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని