Stock market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు - Stock markets are in Green
close

Updated : 22/10/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత మూడు సెషన్లలో సూచీలు నష్టాలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆసియా మార్కెట్లన్నీ సానుకూలంగా ఉండడంతో దేశీయ సూచీల్లో సెంటిమెంటు పెరిగింది. ఈ లాభాలు ఎంత వరకు నిలుస్తాయన్నది వేచిచూడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐరోపా సూచీలు నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 265 పాయింట్లు లాభపడి 61,188 వద్ద.. నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 18,254 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.83 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని