close
Array ( ) 1

తాజా వార్తలు

‘ఏడాదిలోపు 700 ఛార్జింగ్‌ స్టేషన్లు నిర్మిస్తాం’

దిల్లీ: 2021లోపు 700 విద్యుత్‌ వాహన(ఈవీ) ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు టాటా పవర్‌ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఉన్నతాధికారి వివరాలు వెల్లడించారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె నగరాల్లో ఇప్పటికే 100 ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన టాటా పవర్‌.. 2020, మార్చి కల్లా మరో 300 కేంద్రాలకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ప్రవీర్ సిన్హా మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటివరకు ఈవీలను విడుదల చేసిన ప్రాంతాల్లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఇన్‌స్టాల్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. వచ్చే ఏడాది కల్లా 700 ఈవీలను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం. కేవలం పబ్లిక్‌ స్థలాల్లోనే కాకుండా ఇంటి పరిసరాల్లోనూ ఈవీ ఛార్జింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంపైనా సంస్థ దృష్టి పెట్టింది. మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్స్‌ వంటి ముఖ్యమైన స్థలాల్లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం కంపెనీ మెట్రో రైల్వేల అధికారులతో, మున్సిపల్‌ కార్పొరేషన్లతో సంప్రదింపులు జరుపుతోంది’ అని వెల్లడించారు. 

టాటా పవర్ ఇప్పటికే హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, ఐజీఎల్‌ రిటైల్‌ అవుట్‌లెట్లలోనూ కమర్షియల్‌ ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. డిమాండుకు అనుగుణంగా ఛార్జింగ్‌ కేంద్రాల సామర్థ్యాన్ని 30-50కిలోవాట్లకు పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
VITEEE 2020
besttaxfiler
dr madhu
HITS2020
Saket Pranamam

Panch Pataka

దేవతార్చన