Tesla: భారీ ఎత్తున కార్లను రీకాల్‌ చేసిన టెస్లా..! - Tesla to recall 285000 cars in China and fix cruise control function
close

Published : 27/06/2021 17:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tesla: భారీ ఎత్తున కార్లను రీకాల్‌ చేసిన టెస్లా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్తు కార్ల తయారీ దిగ్గజం టెస్లా 2,85,000 లక్షల విద్యుత్తు వాహనాలను చైనాలో రీకాల్‌ చేసింది. క్రూజ్‌ కంట్రోల్‌ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతోంది. దీంతో వాహనాల వేగం ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఇది భద్రతా పరమైన సమస్యగా మారిందని చైనా అధికారులు చెబుతున్నారు. కొన్ని కార్లలో భద్రతా పరమైన తీవ్ర సమస్యలు ఉన్నట్లు టెస్లా చైనాలో విబో సోషల్‌ మీడియాలో అంగీకరించింది. 

ఈ సమస్యను మొత్తం మూడు రకాల కార్లలో ఉన్నట్లు గుర్తించారు.  డిసెంబర్‌ 2019 నుంచి జూన్‌ 2021 వరకు విక్రయించిన కార్లు ఈ రీకాల్‌ కిందకు వస్తున్నాయి. వీటిల్లో మోడల్‌ 3 కార్లు 2,11,256 ఉండగా.. మోడల్‌ వై కార్లు 38,599 ఉన్నాయి. ఇక మోడల్‌ 3ఎస్‌ కార్లు 35,665 వరకు ఉన్నట్లు సమాచారం. టెస్లా ఆ వాహనాల్లో క్రూజ్‌ కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌ను రిమోట్‌ మాధ్యమలో అప్‌డేట్‌ చేయనుంది. దీంతో ఓనర్లు ఆయా కార్లను కంపెనీ స్టోర్లకు తీసుకెళ్లే పని తప్పుతుంది. 

దీనిపై చైనా నియంత్రణ సంస్థలు స్పందించాయి. టెస్లా క్రూజ్‌ కంట్రోల్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ సమస్య వల్ల నిదానంగా ప్రయాణించే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుంటోంది. కొన్ని సందర్భాల్లో భారీ ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా నెలకొంది. కొన్నాళ్ల కింద టెస్లా చైనా విభాగం తమను సంప్రదించి రీకాల్‌ కోసం అభ్యర్థించినట్లు పేర్కొంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని