రెండో దఫా కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధం - The second round was covid-19 India is ready to face
close

Updated : 06/04/2021 08:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో దఫా కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధం

 ఆర్థిక శాఖ నివేదిక

దిల్లీ: కొవిడ్‌-19 తొలిదశ సంక్షోభాన్ని విజయవంతంగా నియంత్రించిన భారత్‌, రెండో దఫా కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు  సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ నెలవారీ నివేదిక పేర్కొంది. పలు ఆర్థిక గణాంకాల ప్రకారం.. భారత స్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. ‘2020-21లో కరోనా మహమ్మారితో పోరాడిన తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ తోడ్పాటుతో పెట్టుబడులు మళ్లీ ఊపందుకున్నాయి. 2021-22 బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయాలకు చేసిన కేటాయింపులు వృద్ధికి భారీగా తోడ్పాటు ఇవ్వనున్నాయి’ అని ఆర్థిక శాఖ తెలిపింది. ఫిబ్రవరి మధ్య నుంచి రోజువారీ కొత్త కేసులు పెరగడంతో భారత్‌లో కొవిడ్‌-19 రెండో దశ ప్రారంభమైందని, అయితే మొదటి దశ గరిష్ఠానికి, రెండో దఫా ప్రారంభానికి మధ్య 151 రోజుల సమయం వచ్చిందని, ఇతర దేశాల్లో ఇది మరింత తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. భారత్‌లో కొవిడ్‌ టీకా ప్రక్రియ స్థిరంగా విస్తరిస్తోందని, మరిన్ని అంశాల్లో దేశం తయారుగా ఉన్నట్లు వివరించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని