వొడాఫోన్‌ ఐడియా నష్టం తగ్గింది - Vodafone Idea Q3 loss narrows
close

Published : 14/02/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వొడాఫోన్‌ ఐడియా నష్టం తగ్గింది

దిల్లీ: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత ప్రాతిపదికన రూ.4,532.10 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2019లో ఇదే సమయంలో కంపెనీకి వచ్చిన రూ.6,438.80 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టం తగ్గింది. ఇండస్‌ టవర్స్‌లో వాటా విక్రయం కలిసిరావడం ఇందుకు కారణమైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.11,089.40 కోట్ల నుంచి 1.7 శాతం తగ్గి రూ.10,894 కోట్లకు పరిమితమైంది. ‘సమీక్షా త్రైమాసికంలో మా నిర్వహణ పనితీరు మెరుగైంది. మా నెట్‌వర్క్‌ను విడిచి పెట్టి వేరే నెట్‌వర్క్‌కు మారే చందాదార్ల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్నాం. వ్యూహాల అమలుపై దృష్టి సారించడాన్ని కొనసాగిస్తూనే, వ్యయ నియంత్రణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తామ’ని వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మరోవైపు రూ.25,000 కోట్ల మేర నిధుల సమీకరణకు వొడాఫోన్‌ ఐడియా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపిందని, ఇప్పటికే పలు పెట్టుబడిదార్లతో సంప్రదింపులు జరుపుతున్నామని టక్కర్‌ వెల్లడించారు. అక్టోబరు-డిసెంబరులో వొడాఫోన్‌ ఐడియా చందాదార్ల సంఖ్య 11 శాతం తగ్గి 26.98 కోట్లకు పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీకి 30.4 కోట్ల వరకు చందాదార్లు ఉన్నారు. జులై- సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరు- డిసెంబరులో ఒక్కో వినియోగదారుపై సగటు ఆర్జన(ఆర్పు) రూ.119 నుంచి రూ.121కి పెరిగింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని