Zomato Gaurav Gupta: జొమాటో సహవ్యవస్థాపకుడు గౌరవ్‌ గుప్తా నిష్క్రమణ - Zomato cofounder Gaurav Gupta Exited
close

Updated : 14/09/2021 19:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Zomato Gaurav Gupta: జొమాటో సహవ్యవస్థాపకుడు గౌరవ్‌ గుప్తా నిష్క్రమణ

దిల్లీ: ఆన్‌లైన్‌ ఆహార పంపిణీ సంస్థ జొమాటో సహవ్యవస్థాపకుడు గౌరవ్‌ గుప్తా కంపెనీ నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతం కంపెనీలో సరఫరా విభాగానికి అధిపతిగా ఉన్న ఆయన తన నిర్ణయాన్ని తెలియజేస్తూ ఉద్యోగులకు మంగళవారం లేఖ రాశారు. జొమాటోలో పనిచేసిన కాలం ఆనందంగా గడిచిందన్నారు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నానని పేర్కొన్నారు.

2015లో టేబుల్‌ బుకింగ్స్‌ విభాగాధిపతిగా జొమాటోలో చేరిన గౌరవ్‌ గుప్తా దాదాపు మూడేళ్ల పాటు సీఓఓగా వ్యవహరించారు. కొత్తగా ప్రారంభించిన న్యూట్రాస్యూటికల్స్‌ బిజినెస్‌పై దృష్టి సారించేందుకు గౌరవ్‌కు కంపెనీ 2019లో సహ వ్యవస్థాపకుడి హోదా కల్పించింది. కంపెనీని ఐపీఓకి తీసుకెళ్లడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. నిత్యావసర సరకుల పంపిణీ సేవలైన గ్రోఫర్స్‌ విభాగాన్ని జొమాటో వేదికపైకి తేవడంలోనూ ఆయనది కీలక పాత్ర. అయితే, గ్రోఫర్స్‌, న్యూట్రాస్యూటికల్స్‌.. రెండు సేవలను నిలిపివేస్తున్నట్లు జొమాటో ఇటీవలే ప్రకటించింది. ఈ తరుణంలో గౌరవ్‌ సంస్థ నుంచి నిష్క్రమించడం గమనార్హం.

గౌరవ్‌ నిష్క్రమణ కంపెనీ షేర్లపై ప్రభావం చూపింది. ఇంట్రాడేలో రూ.151 వద్ద గరిష్ఠాల్లో నమోదవుతున్న సూచీ.. ఈ వార్త బయటకు రాగానే ఒక్కసారిగా రూ.136కు పడిపోయింది. తిరిగి కోలుకున్నప్పటికీ అమ్మకాల ఒత్తిడి మాత్రం కనిపిస్తోంది.



Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని