సీజీఏగా దీపక్‌ దాస్‌ బాధ్యతల స్వీకరణ - business
close

Published : 02/08/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీజీఏగా దీపక్‌ దాస్‌ బాధ్యతల స్వీకరణ

దిల్లీ: కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌(సీజీఏ) బాధ్యతలను సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ అధికారి దీపక్‌ దాస్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్‌ ఐసీఏఎస్‌ అధికారి అయిన దాస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం-అటవీ, డీపీఐఐటీ వంటి మంత్రిత్వ శాఖల్లో పలు హోదాల్లో పనిచేశారు. భారీ పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయం, రోడ్డు రవాణా, సీబీఐటీ, కస్టమ్స్‌ వంటి విభాగాల్లో కీలక పాత్రలో బాధ్యతలు నిర్వర్తించారు. సీజీఏగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌కు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌గా ఉన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని