ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఐటీ సేవల కంపెనీ సైయెంట్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1044.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20 ఇదేకాలంలో ఆదాయం రూ.1105.9 కోట్లు ఉండటం గమనార్హం. ఇదే సమయంలో నికరలాభం రూ.107.6 కోట్ల నుంచి రూ.95.4 కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి సైయెంట్ రూ.3039.3 కోట్ల ఆదాయాన్ని, రూ.260.7 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే కాలంలో ఆదాయం రూ.3353.8 కోట్లు, నికరలాభం రూ.295 కోట్లు ఉన్నాయి. సమీక్షా త్రైమాసిక ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు సైయెంట్ ఎండీ బి.కృష్ణ పేర్కొన్నారు. ఇటీవల కొన్ని పెద్ద కాంట్రాక్టులు వచ్చినందున సమీప భవిష్యత్తులో ఆదాయాలు పెరుగుతాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి రెండంకెల వృద్ధి ఉంటుందనే అంచనాల్లో మార్పు ఉండదని స్పష్టం చేశారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?