close

Published : 26/01/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వ్యాపార పద్మాలు

కేంద్రప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులూ ఉన్నారు.


పద్మ భూషణ్‌ - రజ్నికాంత్‌ దేవిదాస్‌ ష్రాఫ్‌ (యూపీఎల్‌)

సస్య రక్షణ రాజుగా పేరిందిన ష్రాఫ్‌ యూపీఎల్‌ కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌. 1969లో రెడ్‌ ఫాస్ఫరస్‌ తయారీని చేపట్టి, రైతులను ఆదుకుంటున్నారు. అల్యూమినియం ఫాస్ఫైడ్‌, జింక్‌ ఫాస్ఫైడ్‌ వంటివీ ఉత్పత్తి చేస్తూ పంట సంరక్షణ ఉత్పత్తుల్లో ప్రపంచ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిపారు.


పద్మశ్రీ - రజని బెక్టార్‌ (బెక్టార్‌ ఫుడ్స్‌)

లుధియానాకు చెందిన రజని బెక్టార్‌.. పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తీరు ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం. కేవలం రూ.300 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన ఆమె, ఇటీవలి ఐపీఓ ద్వారా రూ.541 కోట్లు సమీకరించారు. ఈ ఐపీఓకు 198 రెట్ల అధిక స్పందన లభించడం గమనార్హం.


పద్మశ్రీ- జస్వంతిబెన్‌ జమ్నాదాస్‌ పోపట్‌

గుజరాతీ గృహిణులు కలిసి 50 ఏళ్ల క్రితమే లిజ్జత్‌ పాపడ్‌ సంస్థను స్థాపించగా, వారిలో జీవించి ఉంది జస్వంతిబెన్‌ ఒక్కరే. ప్రస్తుతం రూ.750 కోట్ల (100 మిలియన్‌ డాలర్ల) టర్నోవర్‌తో పాటు విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తోందీ సంస్థ.


పద్మశ్రీ- పి.సుబ్రమణియన్‌ (శాంతిగేర్స్‌)

కోయంబత్తూర్‌కు చెందిన సుబ్రమణియన్‌ శాంతి గేర్స్‌ను స్థాపించారు. స్పిన్నింగ్‌ మిల్స్‌కు గేర్‌లు సరఫరా చేస్తూ, ఈయన గేర్‌మన్‌గా సుప్రసిద్ధులయ్యారు. శాంతి సోషల్‌ సర్వీసెస్‌తో సామాజిక సేవ చేసిన ఆయన, 2020 డిసెంబరులో మరణించారు. ప్రస్తుతం శాంతి గేర్స్‌ మురుగప్ప గ్రూప్‌ ఆధీనంలో ఉంది.


పద్మశ్రీ - శ్రీధర్‌ వెంబు (జోహో)

సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌గా జోహో సంస్థను 1996లో చెన్నైలో స్థాపించారు. బయటి నుంచి పెట్టుబడులు తీసుకోకుండానే 100 కోట్ల డాలర్ల (యూనికార్న్‌)గా తీర్చిదిద్దారు శ్రీధర్‌. దీన్ని 1000 మంది ఉద్యోగుల విజయంగా ఆయన చెబుతారు.
* పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.7,300 కోట్లు సమీకరించేందుకు అనుమతి నిమిత్తం సెబీకి దరఖాస్తు పత్రాలను ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అందించింది.
* స్టోవ్‌ క్రాఫ్ట్‌ పబ్లిక్‌ ఇష్యూకు తొలి రోజున 99% స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 58,94,642 షేర్లను జారీ చేయనుండగా.. 58,38,776 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో 5.37 రెట్ల స్పందన కనిపించింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని