అదానీకి కోదాడ- ఖమ్మం రహదారి కాంట్రాక్టు
close

Published : 25/03/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదానీకి కోదాడ- ఖమ్మం రహదారి కాంట్రాక్టు

ఈనాడు, హైదరాబాద్‌: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ అయిన అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ తెలంగాణాలో రూ.1039.90 కోట్ల విలువైన జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకుంది. భారత్‌మాలా పరియోజన పథకంలో భాగంగా కోదాడ- ఖమ్మం మధ్య ఎన్‌హెచ్‌-365ఏ రహదారిని నాలుగు వరుసలుగా  నిర్మించే కాంట్రాక్టును హైబ్రిడ్‌ యాన్యూటీ మోడ్‌ (హమ్‌) పద్ధతిలో ఈ కంపెనీ సొంతం చేసుకుంది. రెండేళ్లలో ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసే తదుపరి 15 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టుతో కలిపి అదానీ గ్రూపు చేతిలో హమ్‌/ టీఓటీ (టోల్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో ఆరు రాష్ట్రాల్లోని 8 ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు ప్రాజెక్టులు ఉన్నట్లు అవుతోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని